ఆప్ కి నజ రోనే౯ సంజా

ఆ పాత మధురాల లో నుండి
ఒక మధుర గీతం

ఈ గీతం 1962 లో విడుదలైన “అనపడ్” చిత్రం లోనిది.
గీత రచన-రాజా మెహది అలీ ఖాన్.
సంగీతం- మదన్ మోహన్
గానం-లతా మంగేష్కర్
చిత్ర దర్శకుడు మోహన్ కుమార్

పాట గురించి

హిందీ చిత్ర సీమ లో ఇంతవరకు వచ్చిన గీతాలన్నింటి లోనూ  ఈ రోజుకు కూడా ఈ పాట మొదటి 10 పాటలలో ఒకటి గా రాణిస్తూంది

ప్రఖ్యాత సంగీత దర్శకులు O P నయ్యర్
  ఈ పాట విని
“లతా పాటల కోసం మదన్ మోహన్ పుట్టారా, లేక
మదన్ సంగీతం కోసం లతా పుట్టారా అనిపిస్తుంది”
అని అన్నారు.

సాహిత్యము- ఈ పాటను శ్రీ రాజా మెహిది అలీ ఖాన్ గారు గజల్ రూపం లో ఈ గీతం వ్రాసారు.
ఏ పదం ఎక్కడ ఉండాలో,యెంత అర్థం ఇస్తుందో
తూచి తూచి ప్రతి పదాన్ని పొదిగి ఒక ముత్యాల సరం లా తయారు చేశారు.

సంగీతం- శ్రీ మదన్ మోహన్ గారు ఈ గీతాన్ని
హిందూస్థాని “ఆదాన” అంటే కర్ణాటక దర్భారి
కానడ రాగం లో స్వర పరచి ప్రాణం పోశారు.

గానం- శ్రీమతి లతా గారు తన మధుర స్వరం
తో  పాటకు, దృశ్యానికి జీవం పోశారు.

అభినయం- ఈ పాట చిత్రీకరణ లో దర్శకుని
ప్రతిభ ప్రతిబింబిస్తోంది.

సాధారణం గా ప్రేయసి, ప్రియులలో  భావ వ్యక్తీకరణ
స్త్రీలకు ఎక్కువ. అందుకే  ఆమె మనసు మయూరం లా నాట్యం చేసింది అంటారు.
ఈ పాటలో మాలా సిన్హా తన ఆనందాన్ని తెలుపుతూ నాట్యం చేస్తుంటే ధర్మేంద్ర  సమతుల్యం గా ఉంటాడు.

ఇప్పటి నటీనటులకు ఈ పాట చిత్రీకరణ ఒక పాఠం.

పాట భావం

మీ కనుల పలకిరింపులే తెలిపాయి
నేనంటే మీ కిష్టమని.

మీరు నన్ను స్వీకరించారని తెలిసి
నా హృదయ స్పందన ఆగిపోతుందేమో అన్నంత
ఉద్వేగానికి లోనయ్యాను.

ప్రభూ
నా లోని ప్రతి అణువు ప్రతిచూపు మీకు కృతఙ్ఞతలు
తెలుపుతున్నాయి.

మీరు నాకు గతి,నేను మీకు శ్రుతి
మీరే నా ఆలంబన,ఆదరువు
ఇక ఏ కష్టము నా దరి చేరదు.
నా మనసంతా మీ నీడలే
ఈ రోజు ఇహ పర లోక సుఖా లనన్నింటిని       అనుభవిస్తున్నాను.

మన ఈ కలయిక ను నలు దిక్కులనుండి
వినిపిస్తున్న వేల వేల మంగళ వాయిద్యాలు 
స్వాగతిస్తున్నాయి.

ఈ పాట వింటున్నా, చూస్తున్నా
మనలో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది.
మనం కూడా పాటతో పాటు ప్రయాణిస్తాం
అదే ఈ పాట గొప్పదనం.

ఇదే బాణీ ని తెలుగులో శ్రీ T V రాజు గారు
చిన్ననాటి స్నేహితులు సినిమా లో వాడుకున్నారు.

ఐతే గీత రచయిత శ్రీ c. నారాయణ రెడ్డి గారి
గొప్పదనం
ఆ ట్యూన్ కి, మరియు పాట సందర్భానికి 
సరి తూగే ఉత్తమోత్త మైన సాహిత్యాన్ని
ఇచ్చారు.
శ్రీమతి సుశీల గారు కూడా అంతే ఆర్తి తో పాడినారు.

హిందీ గీతం ఒక పవిత్ర ప్రేమ ను తెలిపితే,
తెలుగు పాట ఒక మాతృ మూర్తి వేదనను, ఆర్తి ని
తెలుపుతాయి.
రెండూ గొప్ప అణి  ముత్యాలు.

Leave a comment