తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో  ఉదయ రాగం హృదయ గానం

తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో
ఉదయ రాగం హృదయ గానం

కోయిల కుహు రాగాలతో మెలుకువ అయింది.
లేచి కూర్చున్నాను. గడియారం వంక చూస్తే సమయం ఉదయం 6.00 గంటలు కావస్తున్నది.కిటికీ లో నుండి వస్తున్న పిల్ల తెమ్మెరలు,ఆ గాలికి ఆడుతూ కిటికీ తెరలకు కట్టిన గంటలు మధుర స్వనం చేస్తున్నాయి. లేచి కిటికీ తెరలు తెరచి చూసాను.
చెరువు గట్టు మీద పశువులను పొలాలకు తీసుకెళ్తున్నారు.పైకి లేచిన గోధూళి, మంచు తెరలు తొలి సంజె కెంజయ లేత కిరణాలతో కలిసి కొత్త రంగులీని వింత సోయాగాలనిస్తూంది.
రామాలయం నుండి బాల మురళి గారు పాడిన పిబరే రామరసం పాట లీలగా వినిపిస్తూంది. అహిర్ భైరవ్ రాగంలో ఉన్న ఈ పాట వింటుంటే
ఎంత అనునాదామో(resonance)
పశువుల మెడ గంటలు చేసే సవ్వడులు (అహిర్ అంటారట), ఒక సంగీత కారుడు ఆ పాటకు లయ బద్దంగా చేస్తున్న తాళం లాగా వినిపిస్తూంది.
ఒక వైపు కోయిల కుహు కుహులు, ఇంకొక వైపు బాల మురళీ గానం మరొక వైపు ఒక చిత్రకారుడు వేసినట్లున్న ప్రకృతి అందాలు.

ఇంత ఆనంద మయ సందర్భం అరుదు గా వస్తుందేమో, నేను కిటికీ దగ్గర అలానే నిలబడి
ఆ రసమయ క్షణాలను ఆస్వాదిస్తున్నాను.
ఈ సుందర దృశ్యాలను,మనసు అనే కెమెరా తో క్లిక్ చేసి,పదిలంగా దాచుకున్నాను.
వెంటనే నాకు చక్రవాక రాగం ( హిందూస్థాని అహిర్ భైరవ్ రాగము కర్ణాటక సంగీతంలో చక్రవాకం) స్ఫురణకు వచ్చి
నా దగ్గర ఉన్న ఈ పాట record ను play చేసి
వింటున్నాను.
ఆత్రేయ గారు సంగీతం గురించి ఎంత చక్కగా వ్రాసారో.
అహిర్ భైరవ్ రాగాన్ని ఉదయ రాగం అని అందుకే అంటారేమో. వింటుంటే తనువు మనసు రెండూ పులకించి పోయి నా హృదయం గానం చేస్తున్న భావన.

నాకు ఎప్పుడో చదివిన ఈ మాటలు గుర్తుకు వచ్చాయి.

మనిషికి పాట తోటి అనుబంధం అనవరతమైంది,అవిభాజ్యమైంది.
మనిషికి పని ఎంత ముఖ్యమో
పాట కూడా అంతే ముఖ్యమనది

ఆప్ కి నజ రోనే౯ సంజా

ఆ పాత మధురాల లో నుండి
ఒక మధుర గీతం

ఈ గీతం 1962 లో విడుదలైన “అనపడ్” చిత్రం లోనిది.
గీత రచన-రాజా మెహది అలీ ఖాన్.
సంగీతం- మదన్ మోహన్
గానం-లతా మంగేష్కర్
చిత్ర దర్శకుడు మోహన్ కుమార్

పాట గురించి

హిందీ చిత్ర సీమ లో ఇంతవరకు వచ్చిన గీతాలన్నింటి లోనూ  ఈ రోజుకు కూడా ఈ పాట మొదటి 10 పాటలలో ఒకటి గా రాణిస్తూంది

ప్రఖ్యాత సంగీత దర్శకులు O P నయ్యర్
  ఈ పాట విని
“లతా పాటల కోసం మదన్ మోహన్ పుట్టారా, లేక
మదన్ సంగీతం కోసం లతా పుట్టారా అనిపిస్తుంది”
అని అన్నారు.

సాహిత్యము- ఈ పాటను శ్రీ రాజా మెహిది అలీ ఖాన్ గారు గజల్ రూపం లో ఈ గీతం వ్రాసారు.
ఏ పదం ఎక్కడ ఉండాలో,యెంత అర్థం ఇస్తుందో
తూచి తూచి ప్రతి పదాన్ని పొదిగి ఒక ముత్యాల సరం లా తయారు చేశారు.

సంగీతం- శ్రీ మదన్ మోహన్ గారు ఈ గీతాన్ని
హిందూస్థాని “ఆదాన” అంటే కర్ణాటక దర్భారి
కానడ రాగం లో స్వర పరచి ప్రాణం పోశారు.

గానం- శ్రీమతి లతా గారు తన మధుర స్వరం
తో  పాటకు, దృశ్యానికి జీవం పోశారు.

అభినయం- ఈ పాట చిత్రీకరణ లో దర్శకుని
ప్రతిభ ప్రతిబింబిస్తోంది.

సాధారణం గా ప్రేయసి, ప్రియులలో  భావ వ్యక్తీకరణ
స్త్రీలకు ఎక్కువ. అందుకే  ఆమె మనసు మయూరం లా నాట్యం చేసింది అంటారు.
ఈ పాటలో మాలా సిన్హా తన ఆనందాన్ని తెలుపుతూ నాట్యం చేస్తుంటే ధర్మేంద్ర  సమతుల్యం గా ఉంటాడు.

ఇప్పటి నటీనటులకు ఈ పాట చిత్రీకరణ ఒక పాఠం.

పాట భావం

మీ కనుల పలకిరింపులే తెలిపాయి
నేనంటే మీ కిష్టమని.

మీరు నన్ను స్వీకరించారని తెలిసి
నా హృదయ స్పందన ఆగిపోతుందేమో అన్నంత
ఉద్వేగానికి లోనయ్యాను.

ప్రభూ
నా లోని ప్రతి అణువు ప్రతిచూపు మీకు కృతఙ్ఞతలు
తెలుపుతున్నాయి.

మీరు నాకు గతి,నేను మీకు శ్రుతి
మీరే నా ఆలంబన,ఆదరువు
ఇక ఏ కష్టము నా దరి చేరదు.
నా మనసంతా మీ నీడలే
ఈ రోజు ఇహ పర లోక సుఖా లనన్నింటిని       అనుభవిస్తున్నాను.

మన ఈ కలయిక ను నలు దిక్కులనుండి
వినిపిస్తున్న వేల వేల మంగళ వాయిద్యాలు 
స్వాగతిస్తున్నాయి.

ఈ పాట వింటున్నా, చూస్తున్నా
మనలో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది.
మనం కూడా పాటతో పాటు ప్రయాణిస్తాం
అదే ఈ పాట గొప్పదనం.

ఇదే బాణీ ని తెలుగులో శ్రీ T V రాజు గారు
చిన్ననాటి స్నేహితులు సినిమా లో వాడుకున్నారు.

ఐతే గీత రచయిత శ్రీ c. నారాయణ రెడ్డి గారి
గొప్పదనం
ఆ ట్యూన్ కి, మరియు పాట సందర్భానికి 
సరి తూగే ఉత్తమోత్త మైన సాహిత్యాన్ని
ఇచ్చారు.
శ్రీమతి సుశీల గారు కూడా అంతే ఆర్తి తో పాడినారు.

హిందీ గీతం ఒక పవిత్ర ప్రేమ ను తెలిపితే,
తెలుగు పాట ఒక మాతృ మూర్తి వేదనను, ఆర్తి ని
తెలుపుతాయి.
రెండూ గొప్ప అణి  ముత్యాలు.

Continue reading “ఆప్ కి నజ రోనే౯ సంజా”

జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు

అన్నమయ్య కీర్తనలలో మేలిమి బంగారం ఈ కీర్తన
బౌళి రాగం లో చేసిన ఈ కీర్తన చెవులకు ఇంపు ను మనసుకు హాయిని ఇస్తుంది.
బౌళి రాగం భూపాల రాగానికి దగ్గరగా ఉంటుంది.
అందుకే ఈ రెండింటిని ఉదయ రాగాలు అంటారు.
పాట

జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు
వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో
యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు
విన్ననీకథామృతమున వీనులు తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో

కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు
బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు
వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో

చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు
చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి
వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో

వెగటునాసోదంబు-వెగటు +అసోదంబు
అసోదంబు-మనిషికి పారవశ్యం కలిగినప్పుడు
శరీరం లో కొన్ని మార్పులు జరుగుతాయి.
మనసులో కలిగిన ఈ పారవశ్యమే శరీరమంతా
పులకిస్తుంది. ఈ పారవశ్య భావం ఎవరికి వారు
అనుభవించాలే గాని,ఇలా ఉంటుందని చెప్పలేము
దీనినే ఆసోదము అంటారు.
వెలితి అంటే లోపము.

భావము

ఓ దేవ దేవా నీవు జగన్మోహనాకారుడవు(ముల్లోకములను మోహింప జేయ గల సౌందర్య రూపము గల వాడవు),
చతురుడవు(సమయ స్ఫూర్తి తో శత్రువులను అణచిన వాడవు), వేదములు ఘోషించే మహానుభావుడవు.

కానీ నిన్ను చూడగానే నాలో కలిగే మార్పులు కొద్దిగా వెగటు గా అనిపిస్తూ ఉంది.
మరి అది నా లోపమో మరి నీ లోపమో తెలియకుండా ఉంది.
కానీ ఒక్కటి మాత్రము నిజము.

నిన్ను యెన్ని మారులు సేవించినా నా కన్నులకు తనివి తీరటం లేదయ్యా.
నీ కథామృతాన్ని ఎంత విన్నా నా చెవులకి తృప్తి కలగటం లేదయ్యా.
మీ సన్నిధిలో మిమ్మల్నెంత నుతించినా కూడా నా నాలుకకు తనివి తీరటం లేదే.
నీ లీల ఎంత కనినా, ఎంత వినినా తనివి తీరదు.
ఇది నా వెలితో నీ వెలితో తెలియరావటం లేదు.

నీ ప్రసాదాన్ని పొంది కూడా నా శరీరం తృప్తి చెందటం లేదు.
నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి నా పాదాలూ తనియటం లేదే.
నీకు సాష్టాంగ నమస్కారాలు చేసి చేసి కూడా నా నుదుటికి తనివి తీరటం లేదయ్యా.
నా ఈ వింత ప్రవర్తన కొందరికి వెడగుదనం (వికారం) గా అనిపిస్తుంది.
ఇది నా వెలితో నీ వెలితో తెలియట్లేదే.

నిన్ను పూజ చేసి చేసిన నా యీ చేతులూ తనివినొందటం లేదే.
నీ సుందరమైన అలంకారములను తలచుకొని కూడా నా చిత్తమూ తనివినొందటం లేదే.
ఓ వేంకటేశ్వరా నా ఆత్మనూ నన్నూ మోహింపచేసితివి.
మునుపే ఇవన్నియు తెలియవచ్చినవి.
కారణం, నీ వెలితో నా వెలితో తెలియరావటంలేదే,తెలియ జేయవయ్యా

మీ టూ నేను సైతం

మీ టూ -నేను సైతం

అప్పుడు శ్రీ శ్రీ గారు
నేను సైతం అంటే
నవ సమాజ నిర్మాణం కోసం
నేను కూడా పాటు పడతానని
ఇప్పుడు
మీ టూ అంటే
ధూర్త సమాజం లో
దోచుకున్న వారిలో ఒకరని
ఇన్ని రోజులు మనం గొప్ప వాళ్లనుకుంటున్న
కొంత మంది జ్ఞానులు, కళా కారులు
మేడి పళ్ళే అని
నాగరికం అనే మేక తోలు కప్పుకున్న
పులులని తెలిసి
అనాగరీకులు అని పిలవబడే
నా లాంటి చదువు లేనివాడు
సంస్కారం ఉన్నవాడు
సిగ్గు తో తలవంచుకుంటున్నాడు

జ్ఞాపకాల తరంగాలు

ఈ వాద్య సంగీతం వింటూంటే
 మన  జ్ణాపకపు పొరల్లో  అంతరాల్లో
ఎక్కడో  ఒక మధురమైన మేలు కొలుపు
అదే నండి  “ఆ కా శ వా ణి” signature tune.

ఇది compose చేసింది- Walter Kaufmann.Oct 23, 1934(జె క స్లె వే కి యా)

 మనలని ఎంతో అలరించన రేడియో కనుమరుగైనది.

ఇది మనలో చాలా మంది అనుభవము కూడా
కావచ్చు

 ఆరింటికి శివరంజని రాగం లో  తీయని మేలుకొలుపు తో “ఆకాశవాణి  కేంద్రం..” అనగానే లేచి కూచునేవాళ్ళం.

చెరువు/బావి  దగ్గరే outdoor shooting అంటే (ఉదయపు కాల కృత్యాలు), గబగబా దంతధావనం కానిచ్చేసి ఇంట్లో కాసిన్ని కాఫీ నీళ్ళు/చధ్ది అన్నం జావ తాగేసి హోమ్ వర్కేఁవైనా వుంటే కానిచ్చేసి,  చూస్తే

భక్తి రం జ ని కార్య క్రమములో

సోమవారంనాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, మంగళవారం సూపర్‌మేన్ లో “శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా” అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో “నమో నమో హనుమంతా” అన్నపాటో…ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!

స్కూలునించి మధ్యాహ్నం భోజనానికి వస్తే “ఆకాశవాణి! ఈవార్తలు ఇంతటితో సమాప్తం!” అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో,   దుగ్గిరాల పూర్నయ్య,  పార్వతీ ప్రసాదో..ఎవరో ఒకరు పలకరించేవారు.

ఎప్పుడైనా సెలవురోజు ఇంట్లోవుంటే

చిన్నక్క, ఏకాంబరం  (   శ్రీమతి రతన్ ప్ర సా దు గారు
మరియు శ్రీ సత్యనారాయణ గారు  కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు. సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పాడిపంటలు మొదలయ్యేది.

పాడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు….వీళ్ళంతా!

రోజూ 4.15 కు బడి వదల గానే  ఇంటికి
పరుగోపరుగు ఎందు కంటే శ్రీలంక కేంద్రం నుండి
4,30 నుండి 4.45 వరకుమీరు కోరిన మధురగీతాలు
 వస్తాయి (మీనాక్షి పొన్నుఁ దొరయ్)
ఆ మ ద్యలో చిరు తిళ్లు

8 వ తరగతికి వచ్చాక

ఇంగ్లీషులో వార్తలు. వినడం .ఢిల్లీనించి ప్రసారమయ్యేవి.
(ప్ర ఖ్యా త news రీడర్స్ surjit sen, చక్ర పాణి గారు)
 ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునే వాళ్ళం.
ఇక ఆదివారాలు సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు. వి.వి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్… వీరందరూ ఎక్కువగా వినబడేవారు.
ఆది వారం మధ్యాహ్నం 3.00 గ.లకు సంక్షిప్త శబ్ద చల న చిత్రం వ్యా ఖ్యా త శ్రీ  వాఢ్రే వు  purushottam గారు.

 వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులమైపోయేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లు
బోని  ఆ భాష వింటే చాలు మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు.  బుధ వారం  రాత్రి బినాక గీత్ మాల హిందీ పాటల కార్యక్రమం వెలువడేది. అహో!     
Ameen sayan గ్రేట్.

ఆరు బయట  నులక మంచం పై  పడుకొని ఆకాశంలో  చుక్కలు చూస్తూ ఆలకించిన ఆ పాటలు విన్న మా జన్మలు ధన్యం. నా కేమాత్రం హిందీ పాటలపై పట్టు వుందంటే ఆ బినాక గీత్ మాల చలవే

10th class త రు వాత
క్రికెట్
విజయ్ నారాయణ్  ముద్దుగా విజ్జి అనె వారూ.
Baalu alagaan,narotham puri
Aanada rao (promoter of Dasapalla group) comentry అద్భుతం
“Tony greig the tall man bowling to
Short man viswanath”

ఓ నా ప్రియతమ రేడియో..నీవే  కానరాని తరంగాలలో(  radio frequency)  నిజంగానే
ఆకాశానికి  వెళ్ళిపోయావు.

ఇప్పుడు వాట్సప్పుల్లోను, ఫేస్ బుక్కుల్లోను కనబడే ‘ హ్మ్……., లోల్….., ఆర్వోఎఫ్ఫెల్….., కె..కె…(ఓకే ఓకే కొచ్చిన తిప్పలు).

 ఇవన్నీ చదువుతోంటే నవ్వు, అసహ్యం, భయం….ఈమూడురకాల భావాలు ఒకేసారి కలుగుతున్నాయి.

. ‘డబ్ల్యూ సి’ అని రాస్తున్నారు. చాలాచోట్ల చూసాక అడిగితే అది ‘వెల్ కమ్’ అని చెప్పారు మా దేశోధ్ధారకులు. నా సందేహమేంటంటే వీళ్ళు కొన్నాళ్ళకి వెల్ కమ్ స్పెల్లింగు మర్చిపోతారేమోనని!

ఇప్పుడు మన యాంకర్లు, టీవీ డబ్బింగ్ ఆర్టిస్టులు, దుష్టచతుష్టయపు హీరోలు,ఆడవాళ్ళ వికృత విలనిజం గగుర్లు పుట్టిస్తున్నాయి.

ఉండడానికి వేలాది ఛానల్స్ వున్నాయిప్పుడు. పార్టీ ప్రచారాలు, డప్పులు, ర్యాంకుల రాద్ధాంతాలతో కొందరు, ‘జంక్షన్లో నా ఫంక్షన్ పెడితే పిల్లో బోర్ల పడతవె పిల్లో’ అన్నపాటకి అత్తాకోడళ్ళు  ఇద్దరిచేతా డ్యాన్సులు, చేయించే మరికొందరు…!

ఇప్పుడు పేరుకి FM ,101 ,103.8 రేడియో channels వున్నా నీ పూర్వ వైభవాన్ని తేలేక వెల వెల పోతున్నాయి.

ఓ నా ప్రియతమ రేడియో..నీవే  కానరాని తరంగాలలో(  radio frequency)  నిజంగానే
ఆకాశానికి  వెళ్ళిపోయావు.

శుభారంభం

ఓం శ్రీ గణేశాయనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
ఈ రోజు అనగా అక్టోబర్ 15, 2018 సోమవారం
శ్రీ విళంబి నామ సంవత్సరం ఆశ్వయుజమాసం శుక్లపక్షం షష్ఠి /సప్తమి నక్షత్రం ప్రశస్త మైన
సరస్వతీ పూజ రోజున అమ్మ వారి ప్రార్థన తో
నా బ్లాగు” హాసం” ప్రారంభిస్తున్నాను.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా-కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ