ఈ వాద్య సంగీతం వింటూంటే
మన జ్ణాపకపు పొరల్లో అంతరాల్లో
ఎక్కడో ఒక మధురమైన మేలు కొలుపు
అదే నండి “ఆ కా శ వా ణి” signature tune.
ఇది compose చేసింది- Walter Kaufmann.Oct 23, 1934(జె క స్లె వే కి యా)
మనలని ఎంతో అలరించన రేడియో కనుమరుగైనది.
ఇది మనలో చాలా మంది అనుభవము కూడా
కావచ్చు
ఆరింటికి శివరంజని రాగం లో తీయని మేలుకొలుపు తో “ఆకాశవాణి కేంద్రం..” అనగానే లేచి కూచునేవాళ్ళం.
చెరువు/బావి దగ్గరే outdoor shooting అంటే (ఉదయపు కాల కృత్యాలు), గబగబా దంతధావనం కానిచ్చేసి ఇంట్లో కాసిన్ని కాఫీ నీళ్ళు/చధ్ది అన్నం జావ తాగేసి హోమ్ వర్కేఁవైనా వుంటే కానిచ్చేసి, చూస్తే
భక్తి రం జ ని కార్య క్రమములో
సోమవారంనాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, మంగళవారం సూపర్‌మేన్ లో “శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా” అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో “నమో నమో హనుమంతా” అన్నపాటో…ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!
స్కూలునించి మధ్యాహ్నం భోజనానికి వస్తే “ఆకాశవాణి! ఈవార్తలు ఇంతటితో సమాప్తం!” అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, దుగ్గిరాల పూర్నయ్య, పార్వతీ ప్రసాదో..ఎవరో ఒకరు పలకరించేవారు.
ఎప్పుడైనా సెలవురోజు ఇంట్లోవుంటే
చిన్నక్క, ఏకాంబరం ( శ్రీమతి రతన్ ప్ర సా దు గారు
మరియు శ్రీ సత్యనారాయణ గారు కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు. సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పాడిపంటలు మొదలయ్యేది.
పాడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు….వీళ్ళంతా!
రోజూ 4.15 కు బడి వదల గానే ఇంటికి
పరుగోపరుగు ఎందు కంటే శ్రీలంక కేంద్రం నుండి
4,30 నుండి 4.45 వరకుమీరు కోరిన మధురగీతాలు
వస్తాయి (మీనాక్షి పొన్నుఁ దొరయ్)
ఆ మ ద్యలో చిరు తిళ్లు
8 వ తరగతికి వచ్చాక
ఇంగ్లీషులో వార్తలు. వినడం .ఢిల్లీనించి ప్రసారమయ్యేవి.
(ప్ర ఖ్యా త news రీడర్స్ surjit sen, చక్ర పాణి గారు)
ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునే వాళ్ళం.
ఇక ఆదివారాలు సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు. వి.వి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్… వీరందరూ ఎక్కువగా వినబడేవారు.
ఆది వారం మధ్యాహ్నం 3.00 గ.లకు సంక్షిప్త శబ్ద చల న చిత్రం వ్యా ఖ్యా త శ్రీ వాఢ్రే వు purushottam గారు.
వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులమైపోయేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లు
బోని ఆ భాష వింటే చాలు మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.
ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు. బుధ వారం రాత్రి బినాక గీత్ మాల హిందీ పాటల కార్యక్రమం వెలువడేది. అహో!
Ameen sayan గ్రేట్.
ఆరు బయట నులక మంచం పై పడుకొని ఆకాశంలో చుక్కలు చూస్తూ ఆలకించిన ఆ పాటలు విన్న మా జన్మలు ధన్యం. నా కేమాత్రం హిందీ పాటలపై పట్టు వుందంటే ఆ బినాక గీత్ మాల చలవే
10th class త రు వాత
క్రికెట్
విజయ్ నారాయణ్ ముద్దుగా విజ్జి అనె వారూ.
Baalu alagaan,narotham puri
Aanada rao (promoter of Dasapalla group) comentry అద్భుతం
“Tony greig the tall man bowling to
Short man viswanath”
ఓ నా ప్రియతమ రేడియో..నీవే కానరాని తరంగాలలో( radio frequency) నిజంగానే
ఆకాశానికి వెళ్ళిపోయావు.
ఇప్పుడు వాట్సప్పుల్లోను, ఫేస్ బుక్కుల్లోను కనబడే ‘ హ్మ్……., లోల్….., ఆర్వోఎఫ్ఫెల్….., కె..కె…(ఓకే ఓకే కొచ్చిన తిప్పలు).
ఇవన్నీ చదువుతోంటే నవ్వు, అసహ్యం, భయం….ఈమూడురకాల భావాలు ఒకేసారి కలుగుతున్నాయి.
. ‘డబ్ల్యూ సి’ అని రాస్తున్నారు. చాలాచోట్ల చూసాక అడిగితే అది ‘వెల్ కమ్’ అని చెప్పారు మా దేశోధ్ధారకులు. నా సందేహమేంటంటే వీళ్ళు కొన్నాళ్ళకి వెల్ కమ్ స్పెల్లింగు మర్చిపోతారేమోనని!
ఇప్పుడు మన యాంకర్లు, టీవీ డబ్బింగ్ ఆర్టిస్టులు, దుష్టచతుష్టయపు హీరోలు,ఆడవాళ్ళ వికృత విలనిజం గగుర్లు పుట్టిస్తున్నాయి.
ఉండడానికి వేలాది ఛానల్స్ వున్నాయిప్పుడు. పార్టీ ప్రచారాలు, డప్పులు, ర్యాంకుల రాద్ధాంతాలతో కొందరు, ‘జంక్షన్లో నా ఫంక్షన్ పెడితే పిల్లో బోర్ల పడతవె పిల్లో’ అన్నపాటకి అత్తాకోడళ్ళు ఇద్దరిచేతా డ్యాన్సులు, చేయించే మరికొందరు…!
ఇప్పుడు పేరుకి FM ,101 ,103.8 రేడియో channels వున్నా నీ పూర్వ వైభవాన్ని తేలేక వెల వెల పోతున్నాయి.
ఓ నా ప్రియతమ రేడియో..నీవే కానరాని తరంగాలలో( radio frequency) నిజంగానే
ఆకాశానికి వెళ్ళిపోయావు.